Hebah Patel: నన్ను నేను చంపుకోబోతున్నానన్న హెబ్బా పటేల్‌, తెలిసినవాళ్లు గ్లింప్స్‌ చూశారా?

23 Feb, 2022 16:36 IST|Sakshi

హీరో రామ్‌ కార్తీక్‌, హీరోయిన్‌ హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం తెలిసినవాళ్లు. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ వీడియో రిలీజ్‌ చేశారు. ఇందులో హీరో చెఫ్‌ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. చివర్లో.. నన్ను నేను చంపుకోబోతున్నాను అన్న హెబ్బా డైలాగ్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. హీరోయిన్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటోంది? దాని వెనక కారణాలు ఏత్టి? ఆత్మహత్యను ఎవరైనా అడ్డుకున్నారా? లేదా? అన్న అనుమానాలకు సమాధానం దొరకాలంటే సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్‌.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానై ఈ సినిమాను భుజానికెత్తుకున్నాడు విప్లవ్‌ కోనేటి. ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. అనంత్‌ కవూరి, అజయ్‌ నాగ్‌ వి సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తుండగా ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పని చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు