నటి ఆరోపణలు.. డీసెంట్‌గా స్పందించిన రమ్యకృష్ణ

4 Jul, 2021 09:54 IST|Sakshi

వనితా విజయ్‌కుమార్‌.. సీనియర్‌ యాక్టర్స్‌ విజయ్‌-మంజుల కూతురు. వ్యక్తిగత కారణాలతో నటనకు చాలాకాలం దూరంగా ఉన్న ఈమె..  బిగ్‌ బాస్‌ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా స్టార్‌ విజయ్‌ టీవీతో ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తోంది. తాజాగా ‘బిగ్‌బాస్‌ జోడిగల్‌’ రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 

ఈ తరుణంలో కాస్టింగ్‌ కౌచ్‌, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్‌ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోకి హోస్ట్‌ వ్యవహరిస్తోంది నటి రమ్యకృష్ణన్‌(రమ్యకృష్ణ). పైగా ఈ షో మొత్తంలో ఆమె సీనియర్‌ కూడా. దీంతో ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని అంతా అనుకుంటున్నారు.

అయితే ఈ వివాదాన్ని ఓ కోలీవుడ్‌ న్యూస్‌ ఛానెల్‌ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించింది. దానికి రమ్యకృష్ణ బదులిస్తూ.. ‘‘షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది’’ అని బదులిచ్చింది.  ‘నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్‌ అని తేల్చేసింది ఆమె. కాగా, చివరి ఎపిసోడ్‌లో వనిత పర్‌ఫార్మెన్స్‌కు పదికి 1 మార్క్‌ ఇచ్చింది రమ్యకృష్ణ.

చదవండి: ఆ కామెంట్‌ నచ్చకే విడిపోయా- హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు