Ram Pothineni :విరాట్‌ కోహ్లి బయోపిక్‌లో రామ్‌ పోతినేని?, హీరో ఏం చెప్పారంటే..

23 Sep, 2023 19:54 IST|Sakshi

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కొహ్లికి దగ్గరి పోలికలు ఉంటాయి. ఇద్దరి హైట్‌తో పాటు ఫేస్‌ కట్‌ కూడా దాదాపు ఒకేలా అనిస్తుంది. 'ఇస్మార్ట్ శంకర్'షూటింగ్‌ సమయంలో రామ్‌ లుక్‌ చూసి అంతా విరాట్‌ కొహ్లిలా ఉన్నారని అన్నారు. అప్పట్లో రామ్‌ ఫోటోలు నెట్టింట తెగవైరల్‌ అయ్యాయి. విరాట్‌కి డూప్‌లా ఉన్నాడంటూ ట్విటర్‌లో కామెంట్స్‌ వచ్చాయి.

ఇదే విషయంపై తాజాగా రామ్‌ స్పందించాడు. రామ్‌ పోతినేని నటించిన స్కంద చిత్రం సెప్టెంబర్‌ 28న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్‌.. ప్రముఖ వాయిస్‌ ఆర్టిస్ట్‌ సంకేత్‌ మాత్రే(అల్లు అర్జున్, రామ్ వంటి తెలుగు స్టార్‌ హీరోలకు సంకేత్‌ హిందీలో డబ్బింగ్‌ చెబుతాడు) కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సంకేత్‌.. ‘విరాట్‌ కోహ్లిలా ఉన్నావని చాలా మంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ఒకవేళ ఆయన బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే చేస్తారా?’ అని ప్రశ్నించారు. 

దానికి రామ్‌ సమాధానం ఇస్తూ.. ‘విరాట్‌లా ఉన్నారని చాలా మంది అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్' కోసం లుక్ డిసైడ్ చేశాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి ఈ కంపేరిజన్ ఎక్కువ వస్తోంది. ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌తో పోల్చడం చాల హ్యాపీ. తని బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే.. తప్పకుండా చేస్తా.  విరాట్ బయోపిక్ అంటే ఎగ్జైటింగ్‌గా ఉంటుంది’అన్నారు. స్కంద విషయానికొస్తే.. అఖండ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామ్‌కి జోడీగా శ్రీలీల నటించింది. తమన్‌ సంగీతం అందించాడు.

మరిన్ని వార్తలు