తగ్గని ‘ఇస్మార్ట్ శంకర్‌’ హవా.. రామ్‌ పోతినేని సరికొత్త రికార్డు

30 May, 2021 19:28 IST|Sakshi

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన మాస్‌ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హవా ఇంకా తగ్గట్లేదు. యూట్యూబ్‌లో ఈ మూవీ దూసుకెళ్తోంది. తాజాగా 200మిలియన్ల(20 కోట్లు) మార్క్‌ను దాటేసి సత్తా చాటింది. 2019లో విడుదలైన ఈ మూవీ హిందీ వెర్షన్‌ని గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో పెట్టారు. టాలీవుడ్‌ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి కూడా ఇస్మార్ట్‌ శంకర్‌కి  నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

ఇప్పటివరకు 1.9మిలియన్ల లైకులలో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఆన్‌లైన్‌లో డబ్బింగ్‌ సినిమాల ద్వారా 20 కోట్ల పైగా వ్యూస్‌ తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. సౌత్‌ ఇండియా నుంచి నాలుగు సినిమాలను 200 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా రామ్‌ ఘనతను దక్కించుకొన్నారు .మొత్తానికి ఇస్మార్ట్ హీరో రామ్ నటనకు ఇపుడు సౌత్ ప్రేక్షకులే కాదు.. నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారని యూట్యూబ్‌ రికార్డులే తెలియజేస్తున్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు