రెడ్‌ ట్రైలర్‌ వచ్చేసింది

24 Dec, 2020 11:46 IST|Sakshi

ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్‌’కు ఇది రీమేక్‌. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో రామ్‌ రెండు విభిన్న పాత్రల్లో నటించినట్లు చూపించారు.ఒకరు క్లాస్‌ అయితే మరొకరు ఊర మాస్‌.

నచ్చిన అమ్మాయి.. కోరుకున్న ఉద్యోగంతో లైఫ్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో హీరో లైఫ్‌లోకి ఓ వ్యక్తి ఎంట్రీతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెబుతూ ట్రైలర్‌ను మొదలవుతుంది. ఇందులో రెండు గెటప్‌లతో రామ్ అదరగొట్టేసినట్లే కనిపిస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ‘అసలే ఉన్నవంటే నాకు మంట.. తప్పు చేశావురా ఈ సారి మంట మాములుగా లేదు’, ‘వాడికి ఉన్న తెలివి తేటలకి సగం సిటీని తూకం వేసి అమ్మెయగలడు’ లాంటి డైలాగ్స్‌ బాగున్నాయి. ఇక, చివర్లో బట్టలు లేకుండా కనిపించి హీరో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు