అంచనాలు మించి ‘రెడ్’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌

15 Jan, 2021 17:18 IST|Sakshi

ఈ సంక్రాంతి కానుకగా ఎన‌ర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని ‘రెడ్’‌ మూవీ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈసినిమాకు ముందు మాస్‌ మహారాజా రవితేజ ‘క్రాక్’‌ మూవీ, థలపతి విజయ్‌ ‘మాస్టర్‌’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంతో తక్కువ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలైన ‘రెడ్’‌ మూవీ టాలీవుడ్‌ బక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏపీ, తెలంగాణల్లో కలిపి మొదటి రోజే 6.7 కోట్ల రూపాయల షేర్స్‌ను రాబట్టింది. యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టడంతో హీరో రామ్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

తాజా కలెక్షన్లకు సంబంధించి ‘రెడ్‌’ అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ రేంజ్‌లో తనకు భారీ ఓపెనింగ్‌ అందించినందుకు ప్రేక్షకులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్’‌లో మాస్‌ లుక్‌లో కనిపించిన రామ్‌ ‘రెడ్’‌ మూవీలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. కాగా రెడ్‌ కలెక్షన్ల తాజా అప్‌డేట్‌ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 6.7 కోట్ల షేర్స్‌ రాగా గ్రాస్ కలెక్షన్స్ 8.9 కోట్లుగా ఉండొచ్చని సమాచారం. థియేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ 50 శాతం ఆక్యుపెన్సీతో ఇన్ని కలెక్షన్లు రావడమంటే సాధారణ విషయం కాదంటున్నారు సినీ విశ్లేషకులు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు