హాట్‌టాపిక్‌గా రామ్‌ పారితోషికం, ఒక్కసారిగా అంత పెంచేశాడా!

13 Jul, 2021 18:49 IST|Sakshi

ఎనర్జీటిక్‌ స్టార్‌, యంగ్‌ హీరో రామ్‌​ పోతినేని రెమ్యునరేషన్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రామ్‌ తమిళ డైరెక్టర్‌ లింగుస్వామితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తు వస్తున్న రామ్‌, తన యాక్టింగ్‌తో పాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్‌ పుట్టిస్తున్నాడు. హిట్‌, ప్లాప్‌లు అని చూడకుండా అదే జోష్‌తో వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న రామ్‌ ఇప్పటి వరకు 18 సినిమాలు పూర్తి చేశాడు.

తాజాడా లింగుస్వామితో తన 19వ సినిమాను పట్టాలెక్కించాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ సోమవారం(జూలై 12) సెట్స్‌పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌ పారితోషికం ఒక్కసారిగా వైరల్‌ అవుతోంది. ఈ మూవీ నుంచి రామ్‌ తన రెమ్యునరేషన్‌ పెంచాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకు ముందు ఒక్క సినిమాకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు తీసుకునే రామ్‌ ఇప్పుడు ఏకంగా మూడు కోట్లు పెంచాడట. లింగుస్వామితో చేస్తున్న ఈ మూవీకి రామ్‌ రూ. 13 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం.

అయితే ఇది ద్విభాష చిత్రం కావడంతో రామ్‌ అంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా ఈ కుర్ర హీరో ఒక్కసారిగా అంత పెంచేశాడా? అంటూ పరిశ్రమకు చెందిన వారు చెవులు కొరుక్కుంటున్నారట. కాగా ఈ మూవీలో రామ్‌ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. లింగుస్వామి రామ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారో లేదో ఈ చిత్రాన్ని ఆపాలంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా అడ్డుకుంటున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు