The Warriorr: అందుకే దెబ్బలు తగిలినా.. డ్యాన్స్‌ మాత్రం ఆపను: రామ్‌

12 Jul, 2022 17:55 IST|Sakshi

‘దెబ్బలు తగిలేలా స్టెప్పులు వేయడం అవసరమా?’ అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. దర్శకులు కూడా అంత కఠినమైన స్టెప్పులు వద్దులేండి అంటుంటారు. కానీ అభిమానుల కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే... నేను వాళ్ల వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా వందశాతం చేయడానికి ప్రయత్నిస్తా’అని హీరో రామ్‌ పోతినేని అన్నారు. రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా, లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్‌’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... 

సాయంత్రానికే పోలీస్ యూనిఫామ్ ఇంటికి తెప్పించా
‘రెడ్‌’ తర్వాత పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అనీ రొటీన్ అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్‌ ఉండాలనేది నా ఫీలింగ్. రొటీన్ కథలు విని వద్దని డిసైడ్ అయ్యాను. లింగుస్వామి కథ చెప్పడానికి వస్తానంటే సరేనన్నాను. అప్పుడు పోలీస్ కథ అని తెలియదు. కథ చెప్పే ముందు నాకు విషయం తెలిసింది. ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా.

బయట నుంచి చూసినప్పుడు ఏ కథైనా ఒకేలా ఉంటుంది. అదే పోలీస్, అదే విలన్! కానీ, ఒక సోల్ ఉంటుంది. పోలీస్ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనేదానిపై సినిమాకి మెయిన్ అవుతుంది. 'ది వారియర్'లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే... లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా. 

అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది
ది వారియర్‌ షూటింగ్‌ సమయంలో కొంచెం సీరియస్ ఇంజ్యూరీ అయ్యింది. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అంటే చిన్నది కాదు కదా!  ఎడమ చెయ్యి పని చేయలేదు. జిమ్ చేసిన తర్వాత మూడు నెలలు ఖాళీగా ఉండటం కష్టం అయ్యింది. ఆ సమయంలో డాక్టర్ ‘జీవితం ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా?’ అని ప్రశ్నించేసరికి..'అలా అడిగారు ఏంటి?' అనుకున్నాను. తర్వాత వారానికి సెట్ అయ్యాను. అప్పటికి ఆది పినిశెట్టి వేరే సినిమాలు చేయకుండా అలా ఉన్నాడు. పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్. నాకు ఏమో నా వల్ల అందరూ వెయిట్ చేస్తున్నారని ఫీలింగ్. సినిమాలే లైఫ్ అనుకునే నాకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది.   

పూరి, లింగు స్వామి డైమండ్స్‌ లాంటి వాళ్లు
పూరి జగన్నాథ్ గారు, లింగుస్వామి గారు ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ... వాళ్ళ బ్రిలియన్స్ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్ అయ్యి కరెక్ట్ స్క్రిప్ట్ పడితే రిజల్ట్ బాగుంటుంది. లింగుస్వామి  కూడా అంతే! ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్‌కు కనెక్ట్ అయ్యాం. ఈ స్క్రిప్ట్ లింగుస్వామి సినిమాగా మారితే ఎలా ఉంటుందో నేను చూశా. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. వీళ్ళందరూ డైమండ్స్ లాంటి వాళ్ళు. లోస్ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది. తుడిస్తే మళ్లీ డైమండ్ కనబడుతుంది. 

ఆది కూడా చాలా ఎగ్జైట్‌ అయ్యాడు
‘ది వారియర్‌’ కథ చెప్పినప్పుడు ఆది పినిశెట్టి రోల్... గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు? అనేది టెన్షన్. అయితే, లింగుస్వామి ఆది పేరు చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆది ఏమో సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథ చెప్పాక... ఆయన కూడా ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకే చెప్పేసి క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు.  

దేవిశ్రీ ఎప్పుడు ఇలా చెప్పలేదు
మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారు. దేవితో నాకు ఏడో సినిమా ఇది. లింగుస్వామి స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి... రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. పాటలు కూడా కార్ స్పీకర్‌లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్‌లో వేరు. ఒక్కో స్పీకర్‌లో సాంగ్ ఎలా రావాలి? అని ఆలోచించి డిజైన్ చేశాడు. సాంగ్స్ మాత్రమే కాదు... కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్... కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ ఇది. 

ఇన్నాళ్లకు కుదిరింది
నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ, అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్... రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి చెప్పిన స్క్రిప్ట్ కుదిరింది.

 
లింగుస్వామి షాకయ్యారు
నేను చెన్నైలో పెరిగాను కాబట్టి తమిళ్ మాట్లాడటం వచ్చు. డబ్బింగ్ చెప్పడం కూడా ఈజీగా అనిపించింది. ‘నేను  మొత్తం డబ్బింగ్ చెప్పిన తర్వాత మీరు వినండి. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అప్పుడు వచ్చి చెబుతాను’అని లింగుస్వామితో అన్నాను. డబ్బింగ్‌ చెప్పిన తర్వాత.. ఒక్క సెన్సార్ కరెక్షన్ తప్ప ఏమీ లేదు. లింగుస్వామి  షాక్ అయ్యారు. 'అంత పర్ఫెక్ట్‌గా ఎలా చెప్పారు. నేను ఊహించలేదు' అని అన్నారు.  

అందుకే ‘ది వారియర్‌’టైటిల్‌
కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే పదం బాగా నచ్చింది. ఎవరూ బయటకు రాకుండా ఇళ్లల్లో ఉన్నప్పుడు డాక్టర్లు, పోలీసులు బయటకు వచ్చారు. అందుకని, వారియర్ టైటిల్ పెట్టాం. 

అలా చేస్తే హిందీ ప్రేక్షకులు చూడరు
హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా ఏమీ చేయకూడదని నేను నమ్ముతా. వాళ్ళు హిందీ సినిమాలు చూస్తున్నారు. తెలుగు, సౌత్ సినిమాలు చూసేది మన ఫ్లేవర్ కోసం! మనం క‌న్‌ఫ్యూజ్‌ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు. హిందీలో డబ్బింగ్ అయినప్పుడు చూశారు. 
 

గ్యాప్‌ తీసుకోను
ది వారియర్‌ విడుదలైన వెంటనే బోయపాటి సినిమా షూటింగ్‌లో పాల్గొంటా. ఈ సారి గ్యాప్‌ తీసుకోవద్దనుకుంటున్నాను. బోయపాటి తర్వాత ఎవరితో సినిమా చేయాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.  ఎవరితో ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. 

మరిన్ని వార్తలు