The Warrior Movie Review Telugu: డాక్టర్​.. పోలీస్​ అయితే..? 'ది వారియర్' సినిమా​ రివ్యూ..

14 Jul, 2022 14:31 IST|Sakshi

టైటిల్ 'ది వారియర్'
నటీనటులు: రామ్​ పోతినేని, ఆది పినిశెట్టి, కృతీశెట్టి, నదియా, అక్షరా గౌడ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్​
కథ, స్క్రీన్​ప్లే, దర్శకత్వం: ఎన్ లింగుస్వామి
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
సినిమాటోగ్రఫీ: సుజీత్​ వాసుదేవ్​
విడుదల తేది: జులై 14, 2022

ఎనర్జిటిక్ స్టార్​ రామ్‌ పోతినేని హీరోగా ఆది పినిశెట్టి విలన్​గా తెరకెక్కిన తాజా చిత్రం 'ది వారియర్​'. కృతీశెట్టి హీరోయిన్​గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వం వహించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్​ చిట్టూరి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో గురువారం (జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్​, ట్రైలర్​కు మంచి రెస్పాన్స్​ రాగా మొదటిసారిగా రామ్​ పోతినేని తమిళ డైరెక్టర్​తో సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాల మధ్య రిలీజైన 'ది వారియర్'​ ప్రేక్షకులను ఏ మేర మెప్పించాడో రివ్యూలో చూద్దాం. 

The Warrior Movie Review In Telugu

కథ:
సత్య (రామ్​ పోతినేని) ఓ డాక్టర్. ఎంబీబీఎస్​ పూర్తయ్యాక హౌస్​ సర్జన్​గా వైద్య వృత్తిని ప్రారంభించేందుకు కర్నూలు వెళతాడు. ఒకరి ప్రాణం కాపాడితే తాను మళ్లీ జన్మించినట్లుగా భావించే వ్యక్తితం సత్యది. అలాంటి సత్య ఎదుటే గురు (ఆది పినిశెట్టి) మనుషులు తను కాపాడిన వారి ప్రాణం తీయడాన్ని తట్టుకోలేకపోతాడు. పోలీస్​లకు కంప్లైంట్ చేసిన లాభం ఉండదు. ఇలాంటి సంఘటనలే ఎదురై గురు చేతిలో సత్య చావు దెబ్బలు తింటాడు. గురు నుంచి తప్పించుకున్న సత్య రెండేళ్ల తర్వాత కర్నూల్​కు డీఎస్పీగా వస్తాడు. ఆ తర్వాత సత్య ఏం చేశాడు ? గురును ఎలా ఎదుర్కొన్నాడు ? పోలీసులను ఎలా మార్చాడు ? డాక్టర్​గా చేయలేని ఆపరేషన్​ పోలీస్​గా ఎలా చేశాడు ? అనే తదితర విషయాలు తెలియాలంటే 'ది వారియర్' చూడాల్సిందే. ​

Ram Pothineni The Warrior Movie Cast

విశ్లేషణ:
పోలీస్​ తరహా సినిమాలు ఇదివరకు చాలానే వచ్చి మెప్పించాయి. కానీ ఒక డాక్టర్​.. పోలీస్​గా మారి రౌడీయిజాన్ని రూపు మాపడం అనే కొత్త కథతో 'ది వారియర్'ను తెరకెక్కించారు దర్శకుడు ఎన్​ లింగుస్వామి. డాక్టర్​గా సత్య ఎదుర్కున్న పరిస్థితులను, అక్కడి పోలీసు వ్యవస్థ తీరును, గురు విలనిజాన్ని చూపించడంలో డైరెక్టర్​ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. సినిమాలో విజిల్​ మహాలక్ష్మి (కృతీశెట్టి), సత్య మధ్య వచ్చే లవ్ ట్రాక్​ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
అయితే సినిమా మొత్తం ఊహించిన విధంగా, రొటీన్​గా సాగుతుంది. దీంతో కొంచెం బోర్​ కొట్టిన ఫీలింగ్​ కలుగుతుంది. చెప్పుకోదగ్గ డైలాగ్​లు సినిమాకు పడలేదు. అయితే సినిమా నేపథ్యానికి తగినట్లుగా ఉన్న బీజీఎం, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ చక్కగా ఉన్నాయి. 

Ram Pothineni The Warrior Movie Rating

ఎవరెలా చేశారంటే:
రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డాక్టర్​గా, పోలీస్​గా, లవర్​గా రామ్​ అదరగొట్టేశాడు. డ్యాన్స్​ మూమెంట్స్​, యాక్షన్​ సీన్లలో చాలా బాగా చేశాడు. పోలీస్​ లుక్​లో  సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక విలన్​గా ఆది పినిశెట్టి యాక్టింగ్​ ఇరగదీశాడు. రామ్​, ఆది పినిశెట్టి పోటాపోటీగా నటించి అబ్బురపరిచారు. మాస్​ లుక్​లో మాస్​ పెర్ఫామెన్స్​తో ఆది చక్కగా నటించాడు. ఆర్జే విజిల్ మహాలక్షిగా కృతీశెట్టి అందంగా నటించింది. సినిమాలో ​ఆమె ప్రజెన్స్ హాయినిస్తుంది.

సత్య తల్లిగా నదియా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చెడ్డవారిని శిక్షించాలని కొడుక్కి చెప్పే తల్లి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. విలన్​ గురు పాత్రకు వచ్చే బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. ఫైనల్​గా చెప్పాలంటే కథ కొత్తగా ఉన్నా కథనం రొటీన్​గా ఉన్న 'ది వారియర్​'. 

-సంజు (సాక్షి వెబ్​ డెస్క్)

మరిన్ని వార్తలు