హ్యాపీ బర్త్‌డే జెన్నూ: రామ్‌

5 Aug, 2020 17:13 IST|Sakshi

హీరోయిన్‌ జెనీలియా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హీరో రామ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆమెకు బర్త్‌డే విషేస్‌ తెలిపారు. రామ్‌, జెనీలియా 2008లో వచ్చిన ‘రెడీ’ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్‌. ఈ విషయాన్ని జెనీలియా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె పుట్టిన రోజు సందర్భంగా రామ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవరినైనా.. ఎప్పుడైనా దేని గురించి అయినా అడగగలిగే అంత అత్యంత నిస్వార్థ, శ్రద్ధగల స్నేహితురాలు నువ్వే. హ్యాపీ బర్త్‌ డే జెన్నూ. రానున్న సంవత్సరాలు మరింత ఉత్తమంగా ఉండాలని ఆశిస్తున్నాను. త్వరలోనే ఇదే రోజున మనందరం మరోసారి కలుసుకుందాం’ అంటూ ట్వీట్‌ చేశారు రామ్‌. అంతేకాక జెనీలియా కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. దీనిలో జెనీలియా, ఆమె భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌, వారి పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.  (సినీ ఇండస్ట్రీపై రామ్‌ ఆసక్తికర ట్వీట్‌)

జెనీలియా తెలుగుతో పాటు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌లో కూడా పని చేశారు. ఆ తర్వాత నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నారు. రామ్‌ ప్రస్తుతం నటించిన చిత్రం ‘రెడ్’‌. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్‌డౌన్‌ విధించడంతో థియేటర్లన్ని బంద్‌ అయ్యాయి. దాంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయం చేశారని సమాచారం. 

హీరోయిన్ జెనీలియా పుట్టిన రోజు స్పెషల్‌ ఫోటోలు ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా