అలాంటి సినిమాలనే తీస్తా: రామ్ రెడ్డి పన్నాల

14 Mar, 2023 17:41 IST|Sakshi

 ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు మంచి మెసేజ్‌ ఇచ్చే చిత్రాలనే తీస్తానని అని దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన  'నేడే విడుద‌ల‌' చిత్రం ఇటీవల విడుదలైంది. సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ప్రధానంగా నష్టపోతోందో, ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేడే విడుదల సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుందని చెబుతున్నారు. సినిమాలో ముఖ్యంగా కామెడీ నచ్చి చాలా మంది ప్రేక్ష‌కులు రిపీట్‌గా చూస్తున్నారు. సినిమా విడుద‌ల‌య్యాక అన్ని కేట‌గిరి ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ పూర్తిగా ఫ్యామిలీ కామెడీ డ్రామా. అందుకే అందరికి నచ్చింది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జగిత్యాల లో మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి.

గతంలో నేను డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే డైరెక్టర్ మారుతీ టాకీస్‌లో కో-డైరెక్టర్ గా పనిచేసాను. నాకు డైరెక్టర్ సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే సుకుమార్ గారికి ఏకలవ్య శిష్యుడిని.  ప్రతి ప్రేక్షకుడు ఆనందపడేలా, ఆలోచింపజేసేలా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అన్నారు. 

మరిన్ని వార్తలు