ఈ రెండు చిత్రాలకు సీక్వెల్‌ తీసే ధ్యైర్యం చేస్తారా?

17 Aug, 2022 11:04 IST|Sakshi

ఒక సినిమా రిలీజ్ కు ముందే సీక్వెల్ ప్రకటించి.. మూవీ హిట్టైన తర్వాత  సీక్వెల్ తీస్తే ఎక్కడ లేని కిక్. కాని సీక్వెల్ ఉంటుందని ముందే ఎనౌన్స్ చేసిన తర్వాత మూవీ ఫట్ అయితే మాత్రం ఎక్కడలేని ఇబ్బంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ది వారియర్, రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రాల దర్శకులు.

ఈ రెండు చిత్రాలు  కూడా జులైలోనే రిలీజ్ అయ్యాయి. వీటి  సక్సెస్ పై హీరోలు మాత్రమే కాదు,దర్శకులు కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే రిలీజ్ కు ముందే సీక్వెల్స్ స్టోరీస్ రెడీగా ఉన్నట్లు తెలిపారు.సీన్ కట్ చేస్తే రామ్ నటించిన వారియర్, రవితేజన కనిపించిన రామారావు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి.ఇప్పుడు ఈ సినిమా దర్శకులు, హీరోలు సీక్వెల్స్ తో తిరిగొస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

(చదవండి: రీ-రిలీజ్‌కు ముస్తాబవుతున్న చిరు, పవన్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు!)

సీక్వెల్ అంటేనే హిట్ సినిమాకు కొనసాగింపు.అలాంటిది మొదటి సినిమానే పరాజయం పాలైతే ఇక ఆ సినిమా నుంచి వచ్చే సీక్వెల్ కు ఎలాంటి క్రేజ్ ఉండదు.అందుకే పార్ట్ 2తో ఫెయిల్యూర్ కాగానే కొంతమంది హీరోలు పార్ట్ 3కి దూరంగా ఉండిపోయారు. శంకర్ దాదా జిందాబాద్, సర్దార్ గబ్బర్ సింగ్, రాజు గారి గది 2, మన్మథుడు 2 చిత్రాలు ఇందుకు ఉదాహరణలు. ఈ లెక్కన రవితేజ, రామ్ లు రామారావు, వారియర్ క్యారెక్టర్స్ ను రిపీట్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు