సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్‌చల్‌!

21 Apr, 2021 17:18 IST|Sakshi

రంభ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.  1992లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రంభ.. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, భోజ్‌పూరీ భాషట్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగమ్మాయే అయిన రంభ మొదట సర్గం అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా అవతారమెత్తారు. అదే ఏడాది ఆ ఒక్కటి ఆడక్కు చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  ఆ తరువాత ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, రౌడీ అన్నయ్య, బొంబాయి ప్రియుడు, హిట్లర్‌​, బావగారు బాగున్నారా, హలో బ్రదర్‌, తొలిముద్దు, ఇద్దరు మిత్రులు వంటి చిత్రాల్లో నటించింది. దాదాపు అప్పటి స్టార్‌ హీరోలంరితోనూ జోడీ కట్టారు. ఇక చివరగా ఆమె 2008లో వచ్చిన దొంగ సచ్చినోడు సినిమాలో నటించారు. 

తరువాత 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రంభ సినిమాల నుంచి తప్పుకున్నారు. మూవీస్‌కు గుడ్‌బై చెప్పి ప్రస్తుతం కుటుంబంతో గుడుపుతున్నారు. అనంతరం బుల్లితెరపై కొన్ని షోలకు వ్యాఖ్యాతగా వచ్చారు.  అయితే తాజాగా రంభ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం 'మహా సముద్రం'. వివాఖపట్నం బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా సినిమా రూపొందుతోంది. జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

 సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జగపతిబాబు, శర్వానంద్‌పై ఓ స్పెషల్‌ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటలో రంభ ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపిస్తాయి. దీంతో పాటలో రంభ ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి సాంగ్‌లో కేవలం రంభ ఫోటోలు మాత్రమే కనిపిస్తాయో.. లేక రంభ కూడా కనిపించనుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాలి.

చదవండి: ఐసోలేషన్‌లోకి ప్రభాస్‌.. రాధేశ్యామ్‌ షూటింగ్‌కు బ్రేక్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు