ధర్మస్థలికి దారులు తెరుచుకున్నాయ్‌..నెట్టింట రామ్‌చరణ్‌ పోస్ట్‌ రచ్చ

10 Jul, 2021 18:44 IST|Sakshi

acharya movie update: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా పలు రంగాలతో పాటు సిని పరిశ్రమ కూడా ప్యాకప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మధ్యలో ఆపేసిన చిత్రాలన్నీ పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ముగింపు దశలో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఆచార్య’ కు సంబంధించి ఓ ఆసక్తికర పోస్ట్‌ను రామ్‌చరణ్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

ఈ జోడి కోసం అభిమానుల ఎదురుచూపులు
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఇదివరకే చిరు చరణ్‌లు వెండితెరపై కనిపించి అలరించిన, అది కేవలం అతిథి పాత్రల వరకే పరిమితంగా ఉండేది. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో అభిమానులకు కనుల విందుగా చేయడానికి వీరి కాంబోకు సంబంధించి..చరణ్‌ది దాదాపు 40 నిమిషాలు ఉంటుందని టాక్‌. 

ఇంటర్‌వెల్‌లో వచ్చే చరణ్‌ పాత్ర సెకండాఫ్‌ అంతా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ సినిమా కు అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్‌ అయ్యాయి. ఈ చిత్రం ఫైనల్‌ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ను రామ్‌చరణ్‌ అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. అందులో ‘ధర్మస్థలికి దారులు మళ్లీ తెరుచుకున్నాయ్‌.. మేము ఫైనల్‌ షెడ్యూల్‌లో ఉన్నాం. త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌తో మీ ముందుంటామని తెలిపారు. 

A post shared by Konidela Production Company (@konidelapro)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు