‘సుశాంత్‌ మరణించే ముందు రోజు మాట్లాడినా’

11 Aug, 2020 16:19 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించే ఒక్క రోజు ముందు తనతో ఫోన్‌ కాల్‌లో మాట్లాడినట్లు నిర్మాత రమేష్‌ తౌరాని తెలిపారు. ఓ సినిమా గురించి చర్చించేందుకు మరో నిర్మాత నిఖిల్‌​ అద్వానితో కలిసి జూన్‌ 13న మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సుశాంత్‌తో కన్ఫరెన్స్‌ కాల్‌లో సంభాషించినట్లు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రేస్‌, అజాబ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ వంటి చిత్రాలకు రమేష్‌ తరౌరీ నిర్మాతగా వ్యవహరించారు. కాగా సుశాంత్‌ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. (సుశాంత్ అన్ని విష‌యాల్లో రియాదే నిర్ణ‌యం)

‘జూన్‌ 13న మధ్యాహ్నం నేను నిఖిల్‌ కలిసి సుశాంత్‌కు ఒక స్టోరీ గురించి వివరించాము. సుశాంత్‌తో పాటు అతని మేనేజర్‌ ఉదయ్ కూడా మాతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడాడు. అయితే వృతిపరంగా చేసిన కాల్‌ ద్వారా సుశాంత్‌ భావాలను అర్థం చేసుకోవలేకపోయాను’ అని నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. తమ మధ్య సంభాషణ సుమారు 15 నిమిషాలు కొనసాగిందని తౌరాని పేర్కొన్నారు. అయితే కేవలం సినిమా చర్చల గురించే సంభాషించినట్లు ఆయన స్పష్టం చేశారు. సుశాంత్‌ మరణంపై వాస్తవాలు వెలువడే దాకా అందరూ ఓపికతో ఉండాలని, అంతేగాని ఇండస్ట్రీ గురించి తప్పుగా ప్రచారం చేయోద్దని విజ్ఞప్తి చేశారు. (ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?)

I have been getting numerous calls from various journalists over the past few days and want to set the record straight about a few facts. 1. A journalist from @timesnow called me asking about a call on 13th June at about 2.15pm that I had with Sushant. I confirmed the same but did not want to comment on anything else. He recorded the call without informing me and therefore it is essential that I talk about what happened. After exchanging pleasantries, Nikhil Advani and I had narrated a story idea to Sushant. And yes we were on a conference call with him and his manager Uday. 2. This journalist also asked me how he sounded on the phone and I’m not aware as to how you can deduce anything about a persons feeling over a professional phone call. Our call was brief for approximately 15 minutes and he liked the idea and we were in preliminary talks. That’s about it. 3. Instead of encouraging wrongful theories about the industry and about his associations, I am requesting everyone to have faith in the system and let the authorities do the needful. And I request everyone to stop calling as we need to refrain from commenting any further on this unbelievable and tragic loss. I sincerely hope he’s resting in peace. Thank you.

A post shared by Ramesh Taurani (@rameshtaurani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా