Ramgopal Varma Tweet: ప్రభాస్ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే.. బాహుబలి కంటే హిట్ అయ్యేది?

24 Oct, 2022 15:41 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఏ కామెంట్ చేసినా ఎవరూ ఊహించని విధంగా కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. నిన్న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌ చేసి రచ్చపై స్పందించారు. బిల్లా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్‌లోనే అభిమానులు బాణాసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది.  ఆర్జీవీ ఆ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ట్వీట్ చేశారు. 

(చదవండి: అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)

తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఇప్పడు రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యేదంటూ పోస్ట్‌ చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ పోస్ట్ చేశాడంటే అది వైరల్‌ కావడం ఖాయం. దీపావళిని పురస్కరించుకుని అందరూ బాగుండాలని తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. 

మరిన్ని వార్తలు