యంగ్ హీరోస్ డేరింగ్ స్టెప్స్.. ఒక్కసారిగా మారిన ప్లానింగ్‌

11 Jun, 2022 12:29 IST|Sakshi

యంగ్ హీరోస్ అని ఎంత కాలం పిలుపించుకుంటారు. యూత్ ఆడియెన్స్ ను ఎంత కాలం ఎంటర్టైన్ చేస్తారు? అదే పనిగా ఎంత కాలం ప్రేమకథల్లో కనిపిస్తారు? అందుకే ఈ జనరేషన్ యంగ్ హీరోస్ తమ ఇమేజ్ మార్చుకునేందుకు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. స్టార్ హీరోలతో పోటీ పడేందుకు డైరెక్ట్ గా స్టార్ డైరెక్టర్స్ తోనే మూవీస్ కమిట్ అవుతున్న యంగ్‌ హీరోస్‌పై ఓ లుక్కేద్దాం.

హీరోస్‌పై ఓ లనేను శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ హలో గురు ప్రేమ కోసమే లాంటి సినిమాలు చేస్తూ వచ్చిన నర్జిటిక్‌ స్టార్‌ రామ్‌.. పూరి జగన్నాథ్‌ మేకింగ్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో నయా ఇమేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా మాస్ కు బాగా చేరువయ్యాడు. చాక్లెట్ బాయ్ కాస్త ఇప్పుడు ‘వారియర్’ గా మారాడు.  రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది వారియర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతంది.  త్వరలో బోయపాటి తో కలసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

ఇక రామ్ కోరుకుంటున్న ఛేంజ్ ఓవర్.. స్టార్ డైరెక్టర్ తో వచ్చే నయా ఇమేజ్‌ని ఇప్పుడు మిగితా యంగ్ హీరోస్ కావాలనకుంటున్నారు. అందుకే నితిన్ కూడా రామ్ బాట పడ్డాడు. చెక్, రంగ్ దే, మాస్ట్రో లాంటి మూవీస్ తర్వాత నితిన్‌ చేస్తున్న మాస్‌ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ మూవీ సురేందర్‌ రెడ్డితో ఓ మూవీ చేయబోతున్నాడు. అది కూడా పక్కా మాస్‌ సినిమానే. అలాగే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా తెరకెక్కించిన వక్కంతం వంశీతోనూ ఊరమాస్ మూవీ చేస్తున్నాడు.

మరోవైపు అక్కినేని నాగచైతన్య కూడా మాస్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్నాడు. వెంకీమామ, లవ్ స్టోరీ, థ్యాంక్యూ చిత్రాల తర్వాత నాగ చైతన్య కూడా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే వెంకట్ ప్రభు తో మూవీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ తో మూవీ చేయబోతున్నాడు. మొత్తానికి యంగ్‌ హీరోలు రూటు మార్చి మాస్‌ బాట పట్టారు. 

మరిన్ని వార్తలు