అప్పుడు అమ్మ... ఇప్పుడు అక్క!

13 May, 2021 00:39 IST|Sakshi

‘బాహుబలి’ వంటి బ్రహ్మాండమైన  హిట్‌ తర్వాత హీరో ప్రభాస్, పవర్‌ఫుల్‌ యాక్టర్‌ రమ్యకృష్ణ మరోసారి కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇందులో ప్రభాస్‌కు అక్క పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి.. ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌కు అమ్మ (పవర్‌ఫుల్‌ శివగామి పాత్ర)గా నటించిన రమ్యకృష్ణ...‘సలార్‌’లో అక్క పాత్రలో కనిపిస్తారా? వేచి చూడాల్సిందే. మరోవైపు ‘బాహుబలి’ తర్వాత ‘సలార్‌’ చిత్రంలో ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారట. అది కూడా తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారట ప్రభాస్‌. ‘సలార్‌’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదలకు షెడ్యూల్‌ అయిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు