మరోసారి బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా...రమ్యకృష్ణ

28 Nov, 2021 05:07 IST|Sakshi

కమల్‌హాసన్‌ కరోనాతో క్వారంటైన్‌లో ఉంటున్నందున ఆయన హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్‌ బాస్‌ 5’ పరిస్థితి ఏంటి? అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక హోస్ట్‌ లిస్ట్‌లో కమల్‌ కుమార్తె శ్రుతీహాసన్, రమ్యకృష్ణల పేర్లు వినిపించాయి. అయితే శ్రుతి తన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ‘బిగ్‌ బాస్‌’కి డేట్స్‌ సర్దుబాటు చేయలేని పరిస్థితి అట. అందుకే నిర్వాహకులు రమ్యకృష్ణను ఖరారు చేశారు. గతంలో తెలుగు ‘బిగ్‌ బాస్‌ 3’ అప్పుడు హోస్ట్‌ నాగార్జున కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకుంటే, ఆ స్థానంలో రమ్యకృష్ణ కొన్నాళ్ల పాటు షోను నడిపారు. ఇప్పుడు ఆమె తమిళ ‘బిగ్‌ బాస్‌’కి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. రమ్యకృష్ణను స్వాగతిస్తూ.. కమల్‌ సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్‌ చేశారు. 

మరిన్ని వార్తలు