సీనియర్‌ నటి వీడియో చూసి శివగామి కంటతడి!

5 Apr, 2021 20:27 IST|Sakshi

శివగామి రమ్యకృష్ణ ఎమోషనల్‌ అయింది. కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టుకుంది. ఇంతకీ ఆమెను అంతలా ఏడిపించిన సంఘటన ఏంటో తెలియాలంటే ఇది చదివేయండి..

అలనాటి అందాల తార రేఖ 'ఇండియన్‌ ఐడల్‌ 12' అనే మ్యూజిక్‌ రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా వెళ్లారు. అక్కడ ఆమె తన నాట్య ప్రతిభతో అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వీకెండ్‌లో ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ను టీవీలో వీక్షించిన రమ్యకృష్ణ భావోద్వేగానికి లోనైంది. సీనియర్‌ నటి రేఖ డ్యాన్స్‌ చూస్తూ టీవీకి అతుక్కుపోయిన శివగామి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మై గాడ్‌ మై గాడ్‌.. నా దేవత రేఖ గారూ.. అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. 'ఆమెను చూసి మీరు కన్నీరుపెట్టుకుంటే మిమ్మల్ని చూసి మేము ఉద్వేగానికి లోనవుతున్నాం' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్‌ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. గౌతమ్‌  మీనన్‌, ప్రశాంత్‌ మురుగేశన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన క్వీన్‌ వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ శక్తి శేషాద్రిలా కనిపించిన విషయం తెలిసిందే. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రను ప్రేరణగా తీసుకుని తెరకెక్కిందీ వెబ్‌ సిరీస్‌. సెకండ్‌ సీజన్‌కు స్క్రిప్ట్‌ రెడీ అయిందని, త్వరలోనే షూటింగ్‌ జరగనుందని ఇటీవల రమ్యకృష్ణ తెలిపింది. 

చదవండి: రిపబ్లిక్: స్పెషల్‌ లుక్‌లో రమ్యకృష్ణ, సాయి ధరమ్‌ తేజ్‌

రష్మిక ఫస్ట్‌ ఆడిషన్‌: వీడియో రిలీజ్‌ చేసిన మాజీ ప్రియుడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు