బిగ్‌బాస్‌ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. వీకెండ్‌ ఎపిసోడ్స్‌కి భారీ ప్లాన్‌!

27 Nov, 2021 11:18 IST|Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌.. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో ప్రస్తుతం ఐదో సీజన్‌ నడుస్తోంది. తెలుగు షోకి కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా ఉన్నారు. అయితే ఇటీవల కరోనా బారిన ఆయన.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బిగ్‌బాస్‌ సీజన్‌ 5కి కొత్త హోస్ట్‌ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కమల్‌ ప్లేస్‌లో తాత్కాలికంగా శ్రుతి హాసన్‌ని హోస్ట్‌గా తీసుకొస్తారనే వార్తలు వినిపించాయి. కానీ కోలీవుడ్ విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు త‌మిళ బిగ్‌బాస్‌ను శ్రుతిహాస‌న్ హోస్ట్ చేయ‌డం లేద‌ట‌. కమల్‌ ప్లేస్‌లో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ త‌మిళంలో హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

తెలుగులో ర‌మ్య‌కృష్ణ‌కు బిగ్ బాస్ కార్య‌క్ర‌మం హోస్ట్ చేసిన అనుభ‌వం ఉంది. నాగార్జున తన 60వ బర్త్ డే సందర్భంగా విహార యాత్ర కోసం ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిన క్రమంలో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హోస్ట్‌గా రమ్యకృష్ణ రంగ ప్రవేశం చేశారు. రెండు రోజులపాటు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అందుకే తమిళ బిగ్‌బాస్‌కి కూడా రమృకృష్ణనే తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ విషయంపై రమ్యకృష్ణను సంప్రదించగా, ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. ఈ వీకెండ్‌లో ఆమెనే షోకు హోస్ట్‌గా వస్తుందని తమిళ జనాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో మరికొన్ని గంటల్లో తేలుతుంది. 

మరిన్ని వార్తలు