నా పాత్రలో రెండూ ఉంటాయి 

6 Mar, 2023 00:44 IST|Sakshi

‘‘నేను సాధారణంగా మంచి లేదా చెడు  పాత్రలు పోషిస్తాను. కానీ, ‘రానా నాయుడు’ లో నేను చేసిన రానా పాత్రలో ఆ రెండూ కలిసి ఉంటాయి’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. వెంకటేష్, రానా తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. కరణ్‌ అన్షుమాన్‌– సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించారు. కరణ్‌ అన్షుమాన్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ– ‘‘రానా నాయుడు’ లో రానా చీకటి జీవితం గడుపుతుంటాడు. కానీ తన కుటుంబాన్ని పో షించడానికి బాగా కష్టపడతాడు. నా పాత్రలో ఎక్కువ కోపం చూపించే సన్నివేశాలున్నాయి. నిజ  జీవితంలో నేను ప్రశాంతంగా ఉంటాను. కానీ ఈ సిరీస్‌లో కోపం ప్రదర్శించడం సవాలుగా అనిపించింది. అదృష్టవశాత్తూ మా బాబాయ్‌కి(వెంకటేష్‌), నాకు  ఆఫ్‌ స్క్రీన్‌ కూడా మంచి బాండింగ్‌ ఉండటంతో నటించడం సులభం అయింది. వైరం ఉన్న పాత్రలో మెప్పించడం ఒక సవాల్‌తో కూడుకున్నప్పటికీ రానా,  నాగా(వెంకటేష్‌ క్యారెక్టర్‌) పాత్రలు, వాటి మధ్య ఉండే ఆవేశం, భావోద్వేగాల పైనే దృష్టిపెట్టాం’’ అన్నారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు