Rana Daggubati: భూవివాదం కేసు.. కోర్టుకు హీరో రానా గైర్హాజరు

2 Aug, 2022 17:47 IST|Sakshi

భూవివాదం కేసులో మంగళవారం హైదరాబాద్‌లోని  సిటీ సివిల్ కోర్టుకు హాజరుకావాల్సిన హీరో రానా.. అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయాడు. నేడు కోర్టుకు హాజరు కాలేనని కోర్టులో పిటిషన్‌ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు.. ఆగస్ట్‌ 10న కచ్చితంగా  హాజరకావాలని ఆదేశించింది. లేని పక్షం లో అడ్వకేట్ కమిషన్  రానా దగ్గరికి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఆగస్ట్‌ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 

ఫిలింనగర్ లో అలనాటి నటి మాధవి లతకు చెందిన 2200 చదరపు గజాల స్ధలాన్ని హీరో దగ్గుబాటి వెంకటేష్ అతని సోదరుడు నిర్మాత దగ్గుబాటి సురేష్ అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ భూమిని నగరానిక చెందిన ఓ వ్యాపారవేత్త  2014లో అగ్రిమెంట్‌ పద్ధతిలో లీజుకు తీసుకున్నాడు. లీజు అగ్రిమెంట్‌ 2016, 2018లో కూడా రెన్యువల్‌ చేశారు.

చదవండి: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత

అగ్రిమెంట్‌ గడువు పూర్తి కాకముందే సురేశ్‌ బాబులో భూమిలోని 1000 గజాలను రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. రిజిష్ట్రేషన్ అయిన అనంతరం రానా అందులోని లీజు దారుడిని స్ధలం ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో అతడు కోర్టు ఆశ్రయించాడు. ఇంకా లీజు అగ్రిమెంట్ గడుపు పూర్తి కాకుండానే స్ధలం  ఖాళీ చేయమడంతో సదరు వ్యాపారవేత్త సిటీ సివిల్ కోర్టులో పిటీషన్  దాఖలు చేశాడు.  దీంతో న్యాయస్దానం రానాకు నోటీసులు జారీ చేశారు. దీనిపై నేడు విచారణ ఉండగా రానా కోర్టుకు గైర్హాజరు అయ్యారు. 

మరిన్ని వార్తలు