లగేజ్‌ మిస్‌.. ఇండిగో విమాన సంస్థపై రానా ఫైర్‌!

4 Dec, 2022 17:10 IST|Sakshi

ఇండిగో ఏయిర్‌ లైన్స్‌ సేవలపై హీరో రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లగేజ్‌ మిస్‌ అయిందని, సిబ్బంది దాన్ని వెతికి పట్టుకోలేకపోయారని ఫైర్‌ అయ్యాడు. ఇండిగో ఏయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురైందంటూ ట్విటర్‌ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ‘ఇండిగో విమాన సేవలు సరిగా లేవు. మిస్సైన లగేజ్‌ ట్రాకింగ్‌ కూడా సరిగా లేదు. ప్రయాణికుల లగేజ్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఉండదు.  ఇక్కడి సిబ్బందికి కూడా సరైన సమాచారం ఉండదు’అని రానా ట్వీట్‌ చేశాడు.  

హైదరాబాద్‌ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లేందుకు రానా శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లాడు. అక్కడ  చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ ఆలస్యమంటూ సిబ్బంది సమాచారం ఇచ్చింది. మరో విమానంలో వెళ్లాల్సిందిగా సూచించారు. లగేజ్‌ కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. బెంగళూరు చేరుకున్నాక కూడా లగేజ్‌ రాకపోవడంతో రానా అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం  చేశాడు. 

మరిన్ని వార్తలు