30% చనిపోయే అవకాశం ఉందన్నారు: రానా కంటతడి

23 Nov, 2020 19:51 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంత వ్యాఖ్యాతగా ఆహా డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో ప్రసారమవుతున్న టాక్‌ షో ‘సామ్‌ జామ్’‌. ‘ఆహా’ తన సబ్‌స్రైబర్లను పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా సమంతతో కొత్తగా ఈ షో చేయిస్తున్నారు. ఇక సామ్‌జామ్‌ షోలో సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో జనాలకు వినోదాన్ని పంచనున్నారు. కేవలం పది ఎపిసోడ్‌లు మాత్రమే ఉండనున్న ఈ షో ఇప్పటికే అన్ని ఎపిసోడ్‌ల షూటింగ్‌లను సమంత పూర్తి చేసుకుంది. నవంబర్‌13న ఈ షో లాంఛనంగా ప్రారంభమవ్వగా.. మొదటి ఎపిసోడ్‌లో అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చారు. సామ్‌తో కలిసి నవ్వూలు చిందిస్తూ, ఆటలాడుతూ కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించాడు. చదవండి: సమంతతో సందడి చేసిన మెగాస్టార్‌..

ఇక సామ్‌జామ్‌ రెండో ఎపిసోడ్‌లో నటుడు దగ్గుబాటి రానా పాల్గొననున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మహానటి సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో కలిసి వచ్చిన రానా తన ఆరోగ్యం గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. అప్పట్లో రానా అనారోగ్యానికి గురవ్వడంతో అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నట్లు వార్తలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే రానా ఒక్కసారిగా బక్క చిక్కిపోయిన ఓ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. అనంతరం అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత రానాను చూసిన అభిమానులు అతని ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిజమేనని భావించారు. చదవండి: రానా ఎంత కట్నం తీసుకున్నారు?

ఇక సామ్‌జామ్‌లో సమంత రానాను ఇదే విషయం అడిగారు. దీనిపై స్పందించిన రానా తను ఎదురైన ఆరోగ్య సమస్యలను చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘సంతోషంగా సాగుతున్న జీవితంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్‌ బటన్‌ వచ్చింది. పుట్టినప్పటి నుంచి బీపీ సమస్య ఉంది. దీని వల్ల గుండెకు సమస్య అవుతుంది. కిడ్నీలు కూడా పాడయ్యాయి. స్ట్రోక్‌ హెమరేజ్‌కు 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందని డాక్టరు చెప్పారు.’ అని పేర్కొన్నారు. ఈ విషయాలు చెబుతున్న క్రమంలో రానా కంటతడి పెట్టుకున్నారు. దీంతో సమంత వెంటనే స్పందిస్తూ.. మీ చుట్టు జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా.. మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 27న ఆహాలో ప్రసారం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు