మెగా హీరో సినిమా.. కీలక పాత్రలో రానా?

21 Oct, 2020 19:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘భల్లాలదేవ’ రానా దగ్గుబాటి ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘అరణ్య’ ఈ సంక్రాంతికి విడుదలకానుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో రాబోతున్న మెగా థ్రిల్లర్‌ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా దర్శకుడు క్రిష్‌ ‘పంజా’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వైష్ణవ్‌కు జోడిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుంది. (చదవండి: రానా సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చేశాడుగా !)

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రిష్‌ రానాను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రిష్‌తో తనకున్న అనుబంధం​ నేపథ్యంలో రానా వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక అంతా ఒకే అయితే భల్లాలదేవ.. మెగా హీరో వైష్ణవ్‌ సినిమాలో పవర్‌ ఫుల్‌ గెస్ట్‌ పాత్రతో ప్రేక్షకులను అలరించనున్నాడు. అడవి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రకుల్‌ గిరిజన యువతిగా నటిస్తోంది. ప్రస్తుతం ‘పంజా’ హైదరాబాద్‌లోని వికారాబాద్‌ అడవుల్లో షూటింగ్‌ జరుగుతోంది. రానా ‘విరాటపర్వం’, ‘1945’ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. యాక్షన్‌ ఎంటటైనర్‌తో రూపొందిన ‘అరణ్య’ 2021 సంక్రాంతికి విడుదల కానుండగా.. ‘1945’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు రానా. (చదవండి: ఏం జరిగినా పని ఎప్పటికీ ఆగదు: రకుల్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు