రెడీ: రానా దగ్గుబాటి

8 Aug, 2020 09:41 IST|Sakshi

నేడే రానా- మిహికా వివాహం

దగ్గుబాటి వారసుడు, టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ రానా దగ్గుబాటి నేడు పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తన ప్రేయసి మిహికా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలో అడుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా రానా ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘‘రెడీ!!’’ అంటూ వరుడిగా మారిన ఈ బాహుబలి స్టార్‌ తన తండ్రి సురేశ్‌ బాబు, బాబాయ్‌ వెంకటేశ్‌లతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ ఇన్‌ అడ్వాన్స్‌’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయ వేడుకల(హల్దీ, మెహందీ)కు సంబంధించిన రానా- మిహికా ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. (మెరిసే.. మురిసే...) 

ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో అతికొద్ది సన్నిహితుల సమక్షంలో రానా- మిహికా వివాహం నిరాడంబంరంగా జరుగనుంది. పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటారని, పెళ్లి వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయడంతో పాటుగా... భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటామని వరుడి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ శుభకార్యానికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా