రానా, మిహికల మొదటి దసరా వేడుకలు

26 Oct, 2020 14:37 IST|Sakshi

రానా దగ్గుబాటి, మిహిక బజాబ్‌ దసరాను ఘనంగా జరుపుకున్నారు. పెళ్లైన తరువాత ఇదే వారి తొలి దసరా కావడంతో కుటుంబంతో కలిసి వేడుకలను చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మిహిక బజాబ్‌ తల్లి బంటి బజాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఇందులో వైలెట్‌ కలర్‌ అండ్‌ హాఫ్‌ వైట్‌ డ్రస్‌ ధరించి మిహికా సంప్రదాయబద్ధంగా కనిపించింది. దానికి తగ్గట్టు ఉండే జ్యూవెలరీని ధరించింది. ఇక ఎప్పటిలాగే రానా తన స్టైలిష్‌ లుక్‌లో వైట్‌ డ్రస్‌లో దర్శనమిచ్చాడు. మిహికా,  రానా, మిహిక తల్లిదండ్రులు కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఆగస్టులో మిహిక బజాజ్‌తో రానా పెళ్లి నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ‘హాథీ మేరీ సాతీ’ సినిమాలో నటిస్తున్నారు. ఇది తెలుగులో అరణ్యగా విడుదల కాబోతుంది.   

Happy Dussehra @ranadaggubati @miheeka

A post shared by Bunty Bajaj (@buntybajaj) on

చదవండి: సంక్రాంతి బరిలో అరణ్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు