కరోనా ఎఫెక్ట్‌: విరాటపర్వం వాయిదా

14 Apr, 2021 17:36 IST|Sakshi

విభిన్నమైన పాత్రలను చేసేందుకు ఏమాత్రం వెనకాడని హీరో రానా దగ్గుబాటి. హిట్టూఫట్టు అని లెక్కలేసుకోకుండా జనాలకు మంచి కథలందించాలని చూసే ఈ హీరో ప్రస్తుతం విరాటపర్వంతో, అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌లో నటిస్తున్నాడు. వీటితోపాటు సుకుమార్‌ శిష్యుడు వెంకీ దర్శకత్వంలో 1940 బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్టోరీతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే కరోనా దెబ్బకు కకావికలమైన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అనుకుంటున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటికే లవ్‌స్టోరీ, టక్‌ జగదీష్‌ వంటి పలు చిత్రాలు వాయిదా బాట పట్టగా తాజాగా విరాటపర్వం కూడా ఆ దిశగానే అడుగులు వేసింది. ఈ మేరకు రానా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశాడు. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను వెల్లడిస్తామని తెలిపాడు. 

వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పేతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. ఇదివరకే రిలీజ్‌ చేసిన పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: 1940 బ్యాక్‌డ్రాప్‌తో రానా సంచలన చిత్రం

స్టోరీ టెల్లింగ్‌ బాగుంది: చిరంజీవి

మరిన్ని వార్తలు