సాయి కుమార్‌ ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పేవారు: రానా

16 Mar, 2021 08:09 IST|Sakshi

‘‘ఇప్పుడు అందరికీ ఆన్‌లైన్‌ క్లాసులు తెలుస్తున్నాయి. కానీ, నాకు నా మొదటి చిత్రం నుంచి సాయికుమార్‌గారు ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పేవారు. అందుకే, ఆయన పిలిస్తే నేను వచ్చేస్తా. ఆదికి ‘శశి’ సినిమా పెద్ద హిట్‌ ఇవ్వాలి’’ అని రానా అన్నారు. ఆది, సురభి జంటగా శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’. ఆర్‌.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా 19న విడుదలవుతోంది.

ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరోలు రానా దగ్గుబాటి, సందీప్‌ కిషన్, నాగశౌర్య, విశ్వక్‌ సేన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో ఆది మాట్లాడుతూ –‘‘శ్రీనివాస్‌ ‘శశి’ కథ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జయిట్‌ అయ్యాను’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్‌ నాయుడు మాట్లాడుతూ– ‘‘సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు. కానీ చెడ్డపేరు రాకుండా సినిమా తీయాలని నిర్మాతలు చెప్పిన మాట మరచిపోలేను. ఇప్పటివరకు మీరు ఆదిని చూశారు. ‘శశి’లో బొమ్మ వేరేలా ఉంటుంది’’ అన్నారు. సభలో సాయికుమార్‌ కూడా పాల్గొన్నారు.

చదవండి: సోషల్‌ హల్‌చల్‌: చీరలో పరువాలు పరుస్తోన్న శ్రద్ధా దాస్‌

మరిన్ని వార్తలు