Rana Daggubati: 'విరాటపర్వం'లో విప్లవ గీతం పాడనున్న రానా

26 Sep, 2021 08:17 IST|Sakshi

రానా గొంతు సవరించుకుంటున్నారు. మరో వారంలో పాట పాడనున్నారు. ఇది మామూలు పాట కాదు.. విప్లవ గీతం. రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’లోనే ఈ పాట ఉంది. ‘రివల్యూషన్‌​  ఈజ్‌ ఏన్‌ యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నక్సలైట్‌ రవన్న పాత్రను చేస్తున్నారు రానా.

ఇందులో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్‌ బాగుంటుందని దర్శకుడికి అనిపించిందట. రానా కూడా పాడటానికి ఓకే చెప్పడంతో, వచ్చే వారం చిత్ర సంగీతదర్శకుడు సురేష్‌ బొబ్బిలి ఆధ్వర్యంలో రికార్డ్‌ చేయనున్నారు. 

చదవండి: మరోసారి చిరంజీవి సరసన తమన్నా
దయచేసి అందరూ హెల్మెట్‌ వేసుకొని వెళ్లండి: వైష్ణవ్‌ తేజ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు