రానా-మిహికా వివాహం; వీరికి మాత్రమే ఆహ్వానం

5 Aug, 2020 15:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ హీరో, దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్‌తో ఈ నెల 8న ఏడడుగులు వేయనున్నారు. పెళ్లికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులన్నీ చకాచకా జరుతున్నాయి. ఇక ‘మేం ప్రేమలో ఉన్నాం’ అని రానా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించడం, ఆ తర్వాత పెద్దలు కలుసుకుని, పెళ్లి ముహూర్తం ఖరారు చేయడం తెలిసిందే. అయితే పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుందని, వివాహానికి ఎంతో మంది అతిథులు వస్తున్నారనే వార్తలు ఇటీవల వినిపించడంతో ఈ వదంతులపై రానా తండ్రి సురేష్‌ బాబు స్పందించారు. రోకా ఫంక్షన్‌ నిర్వహించిన రామానాయుడు స్టూడియోలోనే వివాహ వేడుక జరగనుందని ఆయన స్పష్టం చేశారు. (రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సంద‌డి షురూ!)

సురేష్‌ బాబు మాట్లాడుతూ.. ‘వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరవుతారు. ఇరు కుటుంబ సభ్యులు మినహా అతిథులు ఎవరూ ఉండరు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతుండటం వల్ల ఈ పెళ్లి వేడుకలో ఎవరి ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేయాలని మేం అనుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలో, బయట ఉన్న మా అత్యంత సన్నిహితులను కూడా ఆహ్వానించడం లేదు. పెళ్లి చాలా సింపుల్‌గా జరుగుతుంది. కానీ, అంతే అందంగా కూడా ఉంటుంది’ అని సురేష్ బాబు చెప్పారు.  (మిహికా.. ముందు షాక్‌ అయ్యింది: రానా)

కాగా పెళ్లి వేడుక మొత్తాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని దగ్గుబాటి కుటుంబం ఆలోచిస్తుంది. కరోనా నేపథ్యంలో పెళ్లిలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరు కచ్చితంగా కోవిడ్-19 పరీక్ష చేయించుకుంటారు. వివాహ వేదిక వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేస్తున్నాం. భౌతిక దూరాన్ని పాటిస్తాం. ఇది ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక కాబట్టి దీన్ని అత్యంత భద్రత కలిగిన పండుగగా మారుస్తాం’ అని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా పార్టీని నిర్వహిస్తామని సురేష్ బాబు వెల్లడించారు. (రానా రోకా ఫంక్షన్‌: సామ్‌ ఫుల్‌ హ్యాపీ)

And it’s official!! 💥💥💥💥

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

To the beginning of forever 💕 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

మరిన్ని వార్తలు