ట్రిపుల్‌ ధమాకా అంటే ఇదే..

4 Mar, 2021 10:24 IST|Sakshi

ఈ మధ్యకాలంలో రీమేక్‌ల వైపు మొగ్గు చూపిస్తున్నారు హీరో వెంకటేష్‌. ఆయన నటించిన తమిళ బ్లాక్‌బస్టర్‌ మూవీ అసురాస్‌ రీమేక్‌గా తీసిన నారప్ప చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం దృశ్యం రీమేక్‌లోనూ వెంకటేష్‌ నటిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. మోహన్‌లాల్‌ హీరోగా, జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్‌ చిత్రం ‘దృశ్యం-2’ ఓటీటీలో విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

థ్రిల్లర్‌ కథాంశం, సస్పెన్స్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సమంత కూడా కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ముఖ్య పాత్రల్లో విరద్దరూ కనిపిస్తారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్‌ నటిస్తున్న  ఎఫ్‌-3 సినిమా సెట్స్‌పై ఉంది. దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో ఫుల్‌ బిజీబిజీగా ఉన్నారు. 

చదవండి :  (స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు)
(ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. దమ్ముందా?)

మరిన్ని వార్తలు