విరాటపర్వం మళ్లీ ఆరంభం

14 Oct, 2020 02:46 IST|Sakshi

రానా విరామ పర్వం పూర్తయింది. త్వరలోనే విరాట పర్వానికి సంబంధించిన పని ప్రారంభిస్తారని టాక్‌. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ప్రియమణి, నందితా దాస్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్‌ బాబు, చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుంది. రానా, సాయిపల్లవి ఉద్యమకారుల పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్‌ మొదటివారం నుంచి మళ్లీ మొదలు కానుందని టాక్‌. దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది.  మిగిలిన భాగాన్ని తాజా షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి ప్లాన్‌ చేశారు.  

మరిన్ని వార్తలు