Ranasthali Review: 'రణస్థలి' మూవీ రివ్యూ

26 Nov, 2022 16:54 IST|Sakshi

టైటిల్‌: రణస్థలి
నటీనటులు: ధర్మ, అమ్ము అభిరామి, చాందిని, సమ్మెట గాంధీ, ప్రశాంత్, శివ జామి, నాగేంద్ర , విజయ్ రాగం తదితరులు
నిర్మాణ సంస్థ: ఏ.జె ప్రొడక్షన్ 
నిర్మాత: అనుపమ సురెడ్డి
దర్శకుడు: పరశురామ్ శ్రీనివాస్
సంగీతం: కేశవ్ కిరణ్
సినిమాటోగ్రఫీ: జాస్టి బాలాజీ 
విడుదల తేది: నవంబర్‌ 26, 2022

కరోనా తర్వాత సీనీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. ఒకప్పుడు స్టార్‌ హీరోహీరోయిన్లు ఉంటే చాలు.. ఆ సినిమాను ఆదరించేవారు. కాని ఇప్పుడు హీరో హీరోయిన్లను కాకుండా కంటెంట్‌ ఉన్న  సినిమాలను ఆదరిస్తున్నారు.  కథలో కొత్తదనం ఉంటే చాలు.. చిన్న పెద్ద సినిమా అని చూడకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో వరుసగా చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటికే పలు చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి.  నేడు(నవంబర్‌ 26) మరో చిన్న చిత్రం ‘రణస‍్థలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
బసవ( ధర్మ) అమ్ములు(చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు.. బసవ ఇంట్లోనే పెరుగుతుంది. బసవ తండ్రి(సమ్మెట గాంధీ) వీరిద్దరికి పెళ్లి చేస్తాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో అమ్ములు హత్యకు గురవుతుంది. చక్రవర్తి తోటలో పని చేయడానికి వచ్చిన కూలీలు..అతనితో పాటు అమ్ములును కూడా చంపేస్తారు. అసలు చక్రవర్తి ఎవరు? వీరిద్దరిని కూలీలుగా వచ్చిన కిరాయి గుండాలు ఎందుకు హత్య చేశారు? వారిని పంపించిదెవరు? భార్య హత్యకు కారణమైన వారిని బసవ ఎలా చంపాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
'రణస్థలి'.. ఒక రివేంజ్‌ డ్రామా సినిమా. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని హత్య చేసిన  ముఠాని ఒక సాదాసీదా వ్యక్తి ఎలా మట్టుబెట్టాడు అన్నదే ఈ సినిమా కథ. దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ ఎంచుకున్న పాయింట్‌ పాతదే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా నడిపించాడు. చిన్నచిన్న లాజిక్స్ అక్కడక్కడ మిస్ అయ్యాయి కానీ ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేయడంలో కొంతవరకు విజయం సాధించారు. హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. మాస్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే విధంగా ఆ ఎపిసోడ్ ను డిజైన్ చేసుకున్నాడు. అయితే సినిమాలో హింస ఎక్కువగా ఉండడం ఓ వర్గం ఆడియన్స్‌కి ఇబ్బందిగా ఉంటుంది.  సస్పెన్స్, రా అండ్ రస్టిక్ మూవీస్ ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే... 
బసవ పాత్రకి  ధర్మ న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. అమ్ములు పాత్రలో నటించిన తెలుగు అమ్మాయి చాందిని రావు ఒదిగిపోయింది. ఈశ్వరిగా అమ్ము  తనదైన నటనతో మెప్పించింది. హీరో తండ్రి పాత్రలో సమ్మెట గాంధీ జీవించేశాడు. . విలన్ గా చేసిన శివతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. కేశవ్ కిరణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది.  ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు