Alia Bhat-Rambir Kapoor: అసహ్యం వేస్తోంది.. వారిని అసలు వదిలిపెట్టం: ఆలియా దంపతులు

10 Mar, 2023 12:57 IST|Sakshi

సెలబ్రెటీ లైఫ్‌ అంటే సాధారణ ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వారి ప్రతి అడుగును గమనిస్తుంటారు. ఇక వారి లైఫ్‌ స్టైల్‌పై ఎప్పుడు ఓ కన్నేస్తుంటారు. అదే ఆసక్తితో ఇటీవల ఏకంగా ఆలియా భట్‌ ఇంటిపైనే ఫొకస్‌ పెట్టిన కొందరు బాలీవుడ్‌ ఫొటోగ్రాఫర్లు. తల్లయిన అనంతరం కూతురు ఫొటోను ఇంతరకు ఆలియా దంపతులు రివీల్‌ చేయలేదు. దీంతో చాటుమాటుగా తమ కూతురి ఫొటోలను తీసేందుకు కొందరు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించారు. ఆలియా తన ఇంట్లో బాల్కానీలో కూర్చుని ఉండగా పక్క బిల్డింగ్‌ నుంచి ఫొటోలు తీసేందుకు ట్రే చేయగా అది గమనించిన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

చదవండి: పెళ్లి చేసుకున్న నరేశ్‌-పవిత్ర?

తన ఇంట్లోనే తనకు ప్రైవసీ లేకుండ పోయిందని, సెలబ్రెటీలకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందనే విషయం మర్చిపోవద్దు సోషల్‌ మీడియా వేదికగా ఫొటో గ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఈ సంఘటనపై ఆలియా-రణ్‌బీర్‌లు మరోసారి స్పందించారు. రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట మాట్లాడుతూ.. దీనిపై లీగల్‌గా వెళతామన్నారు. ప్రతిఒక్కరికి పర్సనల్‌ లైఫ్‌ ఎలా ఉంటుందో.. సెలబ్రెటీలకు కూడా అలాగే వ్యక్తిగత జీవితం ఉంటుందన్నారు. తమాషా చేస్తున్నారా? మాకంటూ ప్రైవసీ ఉండదా? ఏకంగా ఇంటికే వచ్చి సీక్రెట్‌ ఫొటోలు తీయాలని చూస్తారా? అంటూ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆలియా. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం

అనంతరం రణ్‌బీర్‌ మాట్లాడుతూ..  ‘ఇండస్ట్రీలో ఫొటోగ్రాఫర్స్‌కి సెలబ్రెటీలకు మధ్య ఆరోగ్యకరమైన రిలేషన్‌ ఉండాలి. మాకు మీరు అవసరం.. మీకు మేము అవసరం. అది వృత్తిపరంగా మాత్రమే. ఎవరికి వారికి పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది. మేము అందరిలా మనుషులమే. సెలబ్రెటీలు అయినంత మాత్రాన మాకుంటూ వ్యక్తిగత జీవితం ఉండదా? మాకు సంబంధించిన ప్రతి విషయం మీకు తెలియాలా. అసలు ఇంటికి వచ్చి కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఏముందు. ఈ విషయాన్ని అంత తెలిగ్గా వదలిపట్టం. అవసరమైతే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. అసలు ఇంట్టో కెమెరాలు పెట్టడం ఏంటీ? తలచుకుంటూనే అసహ్యం వేస్తోంది’ అంటూ రణ్‌బీర్‌ ఘాటుగా స్పందించాడు. 

మరిన్ని వార్తలు