Ranbir Kapoor-Alia Bhat: మహెందీ ఫంక్షన్‌లో ఎమోషనలైన రణ్‌బీర్‌ కపూర్‌

23 Apr, 2022 11:03 IST|Sakshi

Ranbir Kapoor, Alia Bhatt Mehndi Function Photos: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్‌ 14న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసమైన ‘వాస్తు’లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇక స్టార్‌ హీరోహీరోయిన్లు అయిన ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి అంటే ఫ్యాన్స్‌ అంతా ఓ రేంజ్‌ ఊహించేసుకున్నారు. ఎంతో ఆడంబరంగా ఏ స్టార్‌ హోటల్‌ల్లో వీరి పెళ్లి జరుగుతందాని ఆసక్తిగా ఎదురు చూశారు.

తీరా సీక్రెట్‌గా, నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగిపోయింది. అంతేకాదు మూడు మూళ్లు పడేవరకు ఈ జంట తమ వివాహ వేడుకపై అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంలో చాలా గొప్యత పాటిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెళ్లయిన ఇన్ని రోజులకు వీరి మెహెందీ ఫంక్షన్‌ ఫొటోలు బయటకు వచ్చాయి.

ఎంతో సీక్రెట్‌గా కేవలం కొద్ది మంది సెలబ్రెటీలు, బంధుమిత్రుల మధ్య రణ్‌బీర్‌-ఆలియాల వివాహ వేడుకలు జరిగాయి. ఇక మెహెందీ ఫంక్షన్‌లో వీరిద్దరు గులాబీ రంగు దుస్తులు ధరించారు.సింపుల్‌గా జరిగిన ఈ వేడుకలో తెలికపాటి మహెందీతో ఆలియా చిరునవ్వులు చిందిస్తూ మెరిసిపోయింది.

ఇక రణ్‌బీర్‌.. తన తల్లి నీతూ కపూర్‌, సోదరి రిద్ధిమా కపూర్‌లతో కలిసి ఉత్సహంగా డాన్స్‌ చేస్తూ కనిపించాడు. అలాగే తన తండ్రి, దివంగత నటుడు రిషి కపూర్‌ చిత్ర పటం పట్టుకుని కూడా డాన్స్‌ చేశాడు. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని అతడు భావోద్వేగానికి లోనైనట్లు కనిపించాడు.

ఆలియా పేరును తన చేతిపై మెహెందీగా వేయించుకున్నాడు రణ్‌బీర్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు ఫ్యాన్స్‌ను, నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ ఫంక్షన్‌లో రణ్‌బీర్‌ కజిన్స్‌, హీరోయిన్లు కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌లు, అమితాబ్‌ బచ్చన్‌ కూతురు శ్వేతా బచ్చన్‌ నందా, ఆమె కూతురు నవ్వ నవేలీ నందాలతో పాటు తదితరులు సందడి చేశారు. 

మరిన్ని వార్తలు