Ranbir Kapoor: ప్రెగ్నెంట్‌ లేడీపై అలాంటి జోకులా?.. రణ్‌బీర్‌పై నెటిజన్స్‌ ఫైర్‌

20 Aug, 2022 14:10 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో, ఆలియా భట్‌ భర్త రణ్‌బీర్‌ కపూర్‌పై నెటిజన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఆలియా భట్‌పై అలాంటి కామెంట్‌ ఎలా చేస్తావని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్న భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్‌ వరుసగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

(చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన)

తాజాగా రణ్‌బీర్‌, ఆలియా భట్‌, ఆయన్‌ ముఖర్జీ ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’సినిమాకు ఆ స్థాయిలో ప్రచారం చేయడం లేదేంటి?’అని ప్రశ్నించాడు. దీనిపై ఆలియా సమాధానం ఇస్తుండగా.. రణ్‌బీర్‌ మధ్యలో కలగజేసుకొని ‘మా చిత్రాన్ని ఎందుకు భారీగా ప్రమోట్‌ చేయడం లేదంటే ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు’అంటూ ఆలియా బేబీ బంప్‌వైపు చూశాడు.

రణ్‌బీర్‌ మాటలతో ఆలియా ఒక్కసారిగా షాక్‌కు గురవ్వగా... ‘జస్ట్‌ జోక్‌ చేశా’అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు రణ్‌బీర్‌. అయితే ఈ విషయాన్ని ఆలియా లైట్‌ తీసుకుంటే.. నెటిజన్స్‌ మాత్రం రణ్‌బీర్‌పై మండి పడుతున్నారు. ‘రణ్‌బీర్‌ నీకు బుద్దుందా..? ఒక ప్రెగ్నెంట్‌ మహిళని బాడీ షేమింగ్‌ చేస్తావా?; ఆలియా కంటే పదేళ్లు పెద్ద..అయినా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. పబ్లిక్‌లో ఇలాంటి జోకులు వేయడం ఏంటి?  ఈ టైమ్‌లో ఆలియా నీకు బార్బీ బొమ్మలా కనిపించాలా? గతంలో కూడా కత్రినా గురించి హేళన చేస్తూ మాట్లాడావు.. ఇప్పుడు ఆలియాని బాడీ షేమింగ్‌ చేస్తున్నావు.. కొంచైమనా బుద్ది ఉండాలి’అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. 

A post shared by Ranbir Kapoor✨ (@ranbirkapoor143_)

మరిన్ని వార్తలు