Ranbir Kapoor: ఆ చిత్రం చూసే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా: రణ్‌బీర్‌

13 Feb, 2023 13:38 IST|Sakshi

దర్శక-నిర్మాత యశ్‌ రాజ్‌ చొప్రా స్మృత్యంజలిగా నెటిఫ్లిక్స్‌ ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను రిలీజ్‌చేస్తోంది. ‘ది రొమాంటిక్స్‌’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరిని రేపు(ఫిబ్రవరి 14న) వాలెంటైన్స్‌ డే సందర్భంగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌తో యశ్‌ చొప్రాతో ఉన్న అనుబంధం, ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు లవ్‌స్టోరి చిత్రాలపై వారి అభిప్రాయలను సేకరించింది నెట్‌ఫ్లిక్స్‌. ఈ సందర్భంగా ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను ఉద్దేశిస్తూ  ‘ది రొమాంటిక్స్‌’లో షారుక్‌ ఖాన్‌, కాజోల్‌ ఈ మూవీ విశేషాలను పంచుకోగా.. ఆయుష్మాన్‌ ఖురానా, రణ్‌బీర్‌ కపూర్‌ ఈ మూవీ తమని ఎంతగా ప్రభావితం చేసిందో తెలిపారు.

చదవండి: శివరాత్రి స్పెషల్‌: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే

ఈ సందర్భంగా బాలీవుడ్‌ లవర్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయంగే(DDLJ) మా తరానికి నిర్వచనంగా నిలిచింది. ఈ సినిమా చూసినప్పుడు నేను పొందిన అనుభూతి మాట్లల్లో చెప్పలేను. డిడిఎల్‌జే నాపై ఎంతో ప్రభావం చూపింది. ఎంతగా అంటే ఈ సినిమా చూశాకే నా తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాను. డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఎలా ఉండాలో తెలిసింది. అలాగే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా ఈ సినిమా చూసే నేర్చుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ని ఆస్కార్‌, ఎమ్మీ అవార్డుల నామినీ స్మృతి ముంద్రా నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. 

చదవండి: ముంబైలో సిద్ధార్థ్‌-‍కియారా గ్రాండ్‌ రిసెప్షెన్‌, బాలీవుడ్‌ తారల సందడి.. ఫొటోలు వైరల్‌

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని వార్తలు