‘రణ్‌బీర్‌ నా దుస్తులను తన గర్ల్‌ప్రెండ్స్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు’

2 Sep, 2021 13:40 IST|Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో, లవర్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌, సినిమాలతో ఎంత క్రేజ్‌ సంపాదించాడో, తన ప్రేమాయణాలతో అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీఫుల్‌ హీరోయిన్స్‌లో కొందరితో లవ్‌ట్రాక్‌ నడిపించాడు ఈ ప్లే బాయ్‌. అయితే  గర్ల్‌ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్‌ చేయడానికి తన సోదరి దుస్తులను వారికి గిఫ్ట్‌గా ఇచ్చేవాడట ఈ స్మార్ట్‌ హీరో. ఈ విషయాన్ని స్వయంగా తన సోదరి, జ్యువెలరీ డిజైనర్‌ రిద్దిమా కపూర్‌ సా​హ్నీ చెప్పింది.

తాజాగా ఆమె  తన తల్లి, బాలీవుడ్‌ నటి నీతూ కపూర్‌తో కలిసి కపిల్‌ శర్మ షోలో పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమోని సోనీ టీవీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అందులో రిద్దిమా రణ్‌బీర్‌ ప్రేయాయణాల గురించి మాట్లాడుతూ కొన్ని సిక్రెట్స్‌ని చెప్పింది. "ఒక రోజు రణ్‌బీర్‌ గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె వేసుకున్న టాప్‌ చూసిన తర్వాత అతను తనకి నా దుస్తులని గిఫ్ట్‌గా ఇచ్చాడని అర్థమైంది" అని రిద్దిమా పేర్కొన్నారు.

కపిల్‌ శర్మ షోకి సంబంధించి సెట్స్‌లోని కొన్ని ఫోటోలని నీతూ కపూర్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. "తన కూతురితో కలిసి పాల్గొన్న కపిల్‌ శర్మ షో ఎంతో సరాదాగా సాగిందని" వ్యాఖ్యని వాటికి జోడించారు. కాగా, నీతూ కపూర్‌ భర్త, బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ క్యాన్సర్‌తో ఈ ఏడాది ఏ​ప్రిల్‌ 30న మరణించిన విషయం తెలిసిందే.

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

మరిన్ని వార్తలు