Alia Bhatt-Ranbir Kapoor: కొత్త జంటకు నీతూ కపూర్‌ కళ్లు చెదిరే ఫ్లాట్‌ గిఫ్ట్‌, ఖరీదెంతంటే!

20 Apr, 2022 11:12 IST|Sakshi

Neetu Kapoor Gifted Costly Flat To Ranbir-Alia: కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌లు ఏప్రిల్‌ 14న మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యలు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సీక్రెట్‌గా ఈజంట పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహనికి బాలీవుడ్‌ ప్రముఖులెవరు హాజరు కాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌, సిద్దార్థ్‌ మల్హోత్రా, ఇతర స్టార్స్‌ ఖరీదైన బహుమతులు పంపించారట.

చదవండి: అందుకే దక్షిణాది సినిమాలు హిట్‌ అవుతున్నాయి: బాలీవుడ్‌ నటి

ఇదిలా ఉంటే రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి నీతూ కపూర్‌ తన కొడుకు-కొడలికి ఖరీదైన ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్టుమెంట్‌లో అలియా-రణ్‌బీర్‌ల కోసం 6 బెడ్‌రూం ప్లాట్‌ను బహుకరించినట్లు సమాచారం. దీని ఖరీదు దాదాపు 26 కోట్ల రూపాయలు ఉంటుందని బాలీవుడ్‌ సర్కిల్‌ టాక్‌.  అయితే రణ్‌బీర్‌ మాజీ ప్రేయసి, హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ అలియాకు రూ. 14. 5 లక్షల విలువ చేసే ప్లాటినం బ్రాస్‌లెట్‌ను కానుకగా పంపించిందట.

చదవండి: OTT: దక్షిణాది భాషల్లోకి ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, స్ట్రీమింగ్‌ ఎప్పుడు.. ఎక్కడంటే

అలాగే దీపికా తన సొంత బ్రాండ్‌ చోపార్డ్‌ నుంచి ఈ కొత్త జంటకు రూ. 15 లక్షలు విలువ చేసే కపుల్‌ వాచ్‌ ఇవ్వగా.. ప్రియాంక చోప్రా ఆలియాకు రూ.9 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చిందట. ఇక సిద్ధార్థ్‌ మల్హోత్రా అలియాకు రూ.3 లక్షలు వెరసి హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చాడు. వరుణ్ ధావన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అలియాకు రూ. 4 లక్షల గూచీ హై హీల్ చెప్పులను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే అర్జున్ కపూర్ తన స్నేహితుడు రణబీర్ కపూర్‌కు గూచీ జిప్పర్ జాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు, దాని విలువ రూ. 1.5 లక్షలు. 

మరిన్ని వార్తలు