డర్టీ కామెంట్స్​: చిక్కుల్లో రణ్​దీప్​ హుడా

28 May, 2021 12:16 IST|Sakshi

ముంబై: కులాల్ని కించపరిచేలా కామెంట్లు చేస్తూ సెలబ్రిటీలు వరుసగా చిక్కుల్లో పడుతున్నారు.  మున్​మున్​ దత్తా, యూవికా చౌదరి కామెంట్లపై రచ్చ.. ఆపై వాళ్లు దిగొచ్చి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్​లో రణ్​దీప్​ హుడాను చేర్చారు నెటిజన్స్​. బాలీవుడ్​లో ఫైనెస్ట్​ ఆర్టిస్ట్​గా పేరున్న రణ్​దీప్​.. యూపీ మాజీ సీఎం మాయావతిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డాడు. అయితే రణ్​దీప్​ ఆ కామెంట్లు చేసి చాలా కాలం అవుతుండడం విశేషం.
 
డర్టీ కామెంట్లు
గతంలో ఓ ఈవెంట్​లో పాల్గొన్న రణ్​దీప్​ హుడా.. యూపీ మాజీ సీఎం మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘మీకిప్పుడు ఒక డర్టీ జోక్​ చెప్పబోతున్నా’.. అంటూ.. మాయావతి వేషధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు వరుసగా వివాదాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. రణ్​దీప్​ హుడా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ క్షమాపణలు చెపాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఒక మాజీ మహిళా సీఎం, ఆమె సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ రణ్​దీప్​పై మండిపడుతున్నారు. ఆడవాళ్ల పట్ల అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వదలకూడదని చెబుతూ.. #ArrrestRandeepHooda హ్యాష్​ట్యాగ్​ను ట్రెండ్ చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై రణ్​దీప్​ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.  

మరికొందరు రణ్​దీప్​కు కులగజ్జి ఉందని, మానవత్వం లేనోడంటూ కామెంట్లు పెడుతున్నారు. అతని సినిమాల్ని బ్యాన్​ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై రణ్​దీప్​ రియాక్ట్ కావాల్సి ఉంది. ఇక 2012లో మాయావతిపై అభ్యంతరకర ట్వీట్ చేసిన స్టాండప్​ కమెడియన్​ అభిష్​ మాథ్యూ.. రీసెంట్​గా నెటిజన్స్​ ఆగ్రహంతో క్షమాపణలు చెప్పాడు.

A post shared by Randeep Hooda (@randeephooda)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు