సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'అయోమయంలో అరవింద' సినిమా ప్రారంభం

1 Feb, 2023 17:25 IST|Sakshi

తెలుగులో మ‌రో సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్ల‌ర్ రాబోతోంది. ర‌ణ‌ధీర్‌, సుభ‌ శ్రీ హీరోహీరోయిన్లుగా వూర శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ధార్వి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబర్‌ 1 బ్యానర్‌లో లెక్క‌ల మ‌హేంద్రా రెడ్డి నిర్మాణంలో 'అయోమయంలో అరవింద' చిత్రం తెరకెక్కుతోంది. డాక్టర్ ప్రసాద్ మూరెళ్ల సహకార సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర‌ స్వామి దైవ స‌న్నిదానంలో ప్రారంభోత్స‌వ వేడుక జ‌రిగింది. హీరోహీరోయిన్‌ల‌పై ముహూర్తం షాట్‌కు నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామస‌త్య‌నారాయ‌ణ క్లాప్ కొట్టారు. వి.శ్రీ‌నివాస‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలిషాట్‌కు మేడిది వెంక‌టేశ్వ‌ర‌రావు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  

ఈ ప్రారంభ వేడుకలో నిర్మాత లెక్క‌ల మ‌హేంద్రా రెడ్డి మాట్లాడుతూ.. 'అయోమయంలో అరవింద' ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌థ‌ల‌కు భిన్నంగా ఉంటూ ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగిస్తుంది అన్నారు. హీరో ర‌ణ‌ధీర్ మాట్లాడుతూ.. 'నాకిది రెండో సినిమా. ఇది ఎవ‌రూ ఊహించ‌ని క్రైమ్ థ్రిల్ల‌ర్. క‌థ విన్న‌ప్పుడు నేను కూడా అయోమయంలో పడిపోయాను. సినిమా మంచి విజయం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది' అన్నాడు. హీరోయిన్ సుభ‌ శ్రీ మాట్లాడుతూ... 'ఇది నాకు నాలుగ‌వ ప్రాజెక్ట్. ఈ సినిమా యూనిట్ అంతా సపోర్టుగా ఉన్నారు. నాకు అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు థాంక్స్. సినిమా ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది' అని చెప్పుకొచ్చింది.

హీరో తండ్రి బీసు చంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్ర‌ల్లో ఇది కొత్త ప్ర‌యోగం, హీరోయిన్ చేసే మర్డర్స్, హీరో చేధించే తీరు ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ క‌లిగించ‌డం ఖాయం. భిన్నమైన కథ. అంద‌రి ఆశీర్వాదంతో మూడు నెలల్లో సినిమా పూర్తి అయి మీ ముందుకు వ‌స్తుంది.

చదవండి: హీరోయిన్‌కు అభిమాని పూజలు, వీడియో వైరల్‌
వందల కోట్ల స్టార్‌ హీరోకు దారుణ పరిస్థితి

మరిన్ని వార్తలు