ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన ర‌ణధీర్ క‌పూర్

15 May, 2021 19:07 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ క‌రీనా క‌పూర్, క‌రీష్మా క‌పూర్‌ల తండ్రి,నటుడు ర‌ణధీర్ క‌పూర్ (74) కరోనా నుంచి కోలుకున్నారు. గత నెలలో కరోనాతో  ఏప్రిల్ 29న కోకిలాబెన్ అంబానీ ఆసుప‌త్రిలో చేరిన ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ర‌ణధీర్ క‌పూర్‌కు ఐసీయూకి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే. కరోనా రెండవ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆయనకు కరోనా సోకింది. 

ఇక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రణ్‌ధీర్‌ కపూర్‌ ప్రస్తతం తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే ఇంట్లోనే కొద్ది రోజులు క్వారంటైన్‌లో ఉండమని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. ఇక 5 రోజుల పాటు తనకు సేవలందించిన ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారు తనను ఎంతో బాగా చూసుకున్నారని చెప్పారు. ఇ​క ర‌ణధీర్ క‌పూర్ ఇంటికి చేరుకోవడంతో కపూర్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. 

చదవండి : 'ఆ సీరియల్‌ నటుడితో ప్రియాంకకు పెళ్లి చేయాలనుకున్నారట'
నేను చనిపోలేదు.. 7 తర్వాత కూడా నిద్రపోయా: పరేశ్‌ రావల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు