Rangamarthanda Movie: ఓటీటీకి రంగమార్తాండ.. రిలీజ్ ఎప్పుడంటే?

24 Mar, 2023 15:51 IST|Sakshi

ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో కాలిపు మధు, ఎస్‌. వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల థియేటర్లలో అలరిస్తోంది.  మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ  హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేగాక.. సినిమాకు పెట్టిన బడ్జెట్‌లో దాదాపు 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్‌ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు