Rangamarthanda Movie: 'నేనొక నటుడిని'.. ఆసక్తిగా పెంచుతోన్న రంగమార్తాండ టీజర్

18 Mar, 2023 19:22 IST|Sakshi

ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో కాలిపు మధు, ఎస్‌. వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్‌ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్‌తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్‌తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్‌ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్‌ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్‌ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్‌ ‘నటసామ్రాట్‌’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. 

మరిన్ని వార్తలు