భార్యకు నటుడి సర్‌ప్రైజ్‌; థాంక్యూ అంటూ భావోద్వేగం

16 Jun, 2021 15:51 IST|Sakshi

లండన్‌: ‘అమ్మా’ అనే పిలుపు కోసం మహిళలు పరితపించడం సహజం. ముఖ్యంగా గర్భవతైన తర్వాత పుట్టబోయే బిడ్డ గురించి అనేక కలలు కంటారు కాబోయే తల్లులు. తమ పాపాయి ఎలా ఉండబోతుంది, తను ఎప్పుడెప్పుడు ఈ ప్రపంచంలోకి వస్తుందా.. తనను ఎలా పెంచాలి.. ఇలాంటి ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడతాయి. అలాంటి సమయంలో జీవిత భాగస్వామి ఎంత ప్రేమను కురిపిస్తే వారి మనసు అంత ఆహ్లాదంగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు ప్రముఖ రియాలిటీ షో స్ల్పిట్స్‌విల్లా హోస్ట్‌, నటుడు రన్‌విజయ్‌ సింఘా భార్య ప్రియాంక సింఘా.

2014లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పటికే ఓ కూతురు కనియత్‌ సింఘా ఉండగా.. త్వరలోనే మరో చిన్నారి వారి జీవితాల్లోకి రాబోతోంది. ఈ సంతోషకర సమయంలో భార్యకు మరచిపోలేని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు రన్‌విజయ్‌. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైనప్పటికీ.. ఇంటి ఆవరణలోనే అందంగా డెకరేట్‌ చేయించి భార్య సీమంతం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసిన ప్రియాంక సింఘా.. ‘‘ఎనిమిది నెలలుగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం కదా. కాబట్టి మనం బద్దకస్తులుగా మారటం సహజం. ఇతరులకు దూరంగా ఉండక తప్పదు. కానీ అక్కడితోనే అంతా ముగిసిపోదు.

పద పద త్వరగా రెడీ అవ్వు అంటూ తను తొందరపెట్టేశాడు. బయటకు రాగానే గార్డెన్‌లో చూస్తే ఆశ్చర్యం. నా జీవితంలోని బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇది. థాంక్యూ.. బేబీ షవర్‌ను ఇంత అందమైన మధురజ్ఞాపకంగా మలిచిన రన్‌కు, తనకు సహకరించిన సిబ్బందికి రుణపడి ఉంటాను’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా స్ల్పిట్స్‌విల్లా, రోడీస్‌ వంటి షోలకు హోస్ట్‌గా వ్యవహరించిన రన్‌విజయ్‌.. టాస్‌, లండన్‌ డ్రీమ్స్‌, యాక్షన్‌ రిప్లే వంటి సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటించాడు. 

చదవండి: గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి
రిస్క్‌ వద్దు.. పెంట పెట్టుకోవద్దుని హెచ్చరించారు: ఆమిర్‌ ఖాన్‌

A post shared by Prianka Singha (@priankasingha)

A post shared by Prianka Singha (@priankasingha)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు