మరోసారి క్రేజీ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన స్టార్‌ హీరో

19 Oct, 2020 11:30 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌ వీర్ సింగ్ ‌మరోసారి క్రేజీ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టితో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. 2018లో రోహిత్ శెట్టి, రణ్‌వీర్‌ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ‘సింబా’ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా వీరిద్దరి కలయికలో కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సర్కస్‌’ సినిమా రూపొందబోతుంది. ఈ చిత్రం షేక్‌స్పియర్ నవల ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఆధారంగా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సర్కస్‌ సినిమాలో ర‌ణ్‌వీర్‌కు జంట‌గా పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క‌థ‌నాయిక‌లుగా న‌టిస్తున్నారు. అలాగే వ‌రుణ్ శ‌ర్మ‌, సిద్ధార్ధ జాద‌వ్, జానీ లీవ‌ర్, సంజ‌య్ మిశ్రా, వ‌ర్జేష్ హిర్జీ, విజ‌య్ ప‌ట్క‌ర్, సుల్బ ఆర్య‌, ముఖేష్ తివారి, అనిల్ చ‌ర‌ణ్‌జీత్‌, అశ్విని క‌లేస్క‌ర్, ముర‌ళీ శ‌ర్మ ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించ‌నున్నారు. చదవండి: నవ్వించడానికి రెడీ

వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం ముంబై, ఊటీ, గోవా ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. భూషన్‌ కుమార్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 2021 చివ‌రలో మూవీని రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేసుకున్నారు. కాగా, ర‌ణ్‌వీర్, రోహిత్‌ శెట్టి కలయికలో సింబా సినిమా రూపొందడంతోపాటు రోహీత్‌ శెట్టి డైరెక్ట్‌ చేసిన సూర్యవంశీ చిత్రంలో రణ్‌వీర్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించారు. మరో వైపు రణ్‌వీర్‌ నటించిన రెండు చిత్రాలు (83, జయేశ్‌భాయ్‌ జోర్దార్‌) షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ‘83’ చిత్రం ఏప్రిల్‌ విడుదలవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. అదే విధంగా  జయేశ్‌భాయ్ జోర్దార్ వచ్చే విడుదల కానుంది. చదవండి: రణ్‌వీర్‌ కారుకు ప్రమాదం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా