Ranveer Singh: అదే జరిగితే నేనూ ఫామ్‌ హౌస్‌ కొంటాను..

7 Oct, 2021 21:56 IST|Sakshi

హిందీచిత్రాల్లో ఆడిపాడి అలరించిన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ త్వరలోనే బుల్లితెరపైనా సందడి చేయనున్నాడు. బిగ్‌ పిక్చర్‌ అనే టీవీ షోకు హోస్టింగ్‌ చేయబోతున్నాడు. ఈ షోకు బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ఖాన్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే బిగ్‌ పిక్చర్‌ షో కనుక హిట్‌ అయితే సల్మాన్‌ లాగే తను కూడా నవీ ముంబైలోని పన్వేల్‌ ప్రాంతంలో ఓ ఫామ్ హౌస్‌ కొంటానని చెప్పుకొచ్చాడు.

ఈమేరకు మీడియాతో మాట్లాడుతూ.. 'నా భార్య, పిల్లలతో కలిసి ఉండటానికి ఓ మంచి ఇల్లు కోసం చూస్తున్నాను. అందులో పిల్లలు ఆడుకునేందుకు ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. ఆ ఇంట్లో అందరం సంతోషంగా, ఆరోగ్యంగా జీవించగలగాలి. నా జీవితంలో ఇదే బిగ్‌ పిక్చర్‌' అని రణ్‌వీర్‌ చెప్పుకొచ్చాడు. ఒకవేళ షో సక్సెస్‌ అయితే పన్వేల్‌లో ఒక ఫామ్‌హౌస్‌ కొనుగోలు చేస్తానని తెలిపాడు.

కాగా రణ్‌వీర్‌-దీపికా పదుకునే దంపతులు ఈ మధ్యే అలీ బాగ్‌లో కోట్లు విలువ చేసే బంగ్లా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! 5 బెడ్‌రూమ్‌లతో సువిశాలంగా ఉండే ఈ బంగ్లాకు రూ.22 కోట్లు వెచ్చించారని టాక్‌! ఇక ఇదే అలీబాగ్‌లో సెలబ్రిటీలు షారుఖ్‌ ఖాన్‌, అనుష్క శర్మ, రాహుల్‌ ఖన్నాలకు సైతం సొంత నివాసాలు ఉన్న విషయం విదితమే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు