Ranveer Singh: నూలుపోగు లేకుండా రణ్‌వీర్‌ సింగ్‌.. మానసిక రోగి అంటూ బ్యానర్లు

24 Jul, 2022 17:15 IST|Sakshi

బాలీవుడ్ యంగ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) సినిమాల మాట ఎలా ఉన్నా తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే అతను వేసుకున్న డ్రెస్‌లపై నెటిజన్లు ఘోరమైన కామెంట్లు మీమ్స్ చేశారు. 'దీపికా నువ్‌ అయినా నీ భర్తకు చెప్పొచ్చుగా' అంటూ ట్రోల్ చేశారు. ఇక తాజాగా రణ్‌వీర్‌ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్‌ పెద్ద దుమారమే రేపుతోంది. మీమర్స్‌ అయితే మీమ్స్‌తో ఫన్నీగా, సీరియస్‌గా విరుచుకుపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు పొగడ్తుంటే నెటిజన్లు, ప్రేక్షకులు మాత్రం చీల్చి చెండాడుతున్నారు. 

తాజాగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రణ్‌వీర్ సింగ్‌ ఒక మానసిక రోగి అంటూ బ్యానర్లు కట్టారు. నూలు పోగు కూడా లేకుండా ఉన్న రణ్‌వీర్ సింగ్‌ను చూసిన వారు దుస్తులు సేకరించి అతనికి పంపారు. చూస్తుంటే ఈ వివాదం ఇంకా కొనసాగేలా ఉందని తెలుస్తోంది. కాగా పేపర్‌ మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్ నగ్నంగా ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. 1972లో కాస్మొపాలిటన్‌ మ్యాగజైన్ కోసం ప్‌ ఐకాన్‌ బర్ట్‌ రెనాల్డ్స్‌కు నివాళిగా ఈ ఫొటోషూట్‌ చేశారు. 

చదవండి: శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్‌.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ

చదవండి: 'గాడ్‌ ఫాదర్‌' షూటింగ్‌.. చిరంజీవి, సల్మాన్‌ ఫొటో లీక్‌

మరిన్ని వార్తలు